![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -439 లో..... శ్రీవల్లి చేసిన మోసాన్ని భరించలేక చందు డ్రింక్ చేసి ఇంటికి వస్తాడు. దాంతో ఏమైంది నువ్వు తాగి రావడం ఏంటని రామరాజు షాక్ అవుతాడు. నా భార్య వల్ల తాగానని చందు అంటే.. ఎక్కడ నిజం చెప్పేస్తాడో అని నర్మద, ప్రేమ టెన్షన్ పడుతారు. చందుని ధీరజ్ పట్టుకుంటాడు. వాడి మనసు బాలేనట్లు ఉంది అందుకే ఇలా తాగేసి వచ్చాడని రామరాజు అంటాడు. అది చూసిన సాగర్.. చాలా బాగుంది మీకు ఇష్టమైన పెద్దకొడుకు తాగి వస్తే మనసు బాలేక అలా చేసాడని అనుకుంటారు. అదే ప్లేస్ లో ఇప్పుడు నేను ఉంటే ఆ చెంప ఈ చెంప వాయించేవాళ్ళు కానీ వాడు మీ ముద్దులా కొడుకు కదా అని సాగర్ వెటకారంగా మాట్లాడుతాడు.
అరేయ్ ఏం మాట్లాడుతున్నావ్.. ఇన్ని రోజులు మనం అనే అనుకున్నాం.. ఇప్పుడు నువ్వు మీరు అంటూ వేరు చేసి మాట్లాడుతున్నావ్ ఏంటని సాగర్ పై ధీరజ్ కోప్పడతాడు. వాడు నీలాగా మోసం చేసి జాబ్ తెచ్చుకోలేదని సాగర్ పై రామరాజు కోప్పడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సాగర్ గదిలోకి వెళ్ళాక ఏంటి సాగర్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని అడుగుతుంది. అయిన సాగర్ తన మాటలు వినిపించుకోడు. మరొకవైపు ప్రేమ బాధపడుతుంది. ఆ తర్వాత భాగ్యం, ఆనందరావు, శ్రీవల్లి ముగ్గురు కలిసి ఒక రౌడీ దగ్గరికి వెళ్తారు.
మీరు ఒకతనికి ఆక్సిడెంట్ చెయ్యాలని అతనికి చందు ఫోటో చూపిస్తుంది భాగ్యం. ఆ ఫోటో చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. ఏం చేస్తున్నావ్ అమ్మ అని శ్రీవల్లి అడుగుతుంది. నీకేం తెలియదు చిన్న ఆక్సిడెంట్ అంతే.. దాంతో అల్లుడు గారికి నీ అవసరం ఉంటుంది కదా.. అప్పుడు నువ్వు వెళ్లి సేవలు చేస్తుంటే అల్లుడు మారిపోతాడని భాగ్యం ప్లాన్ చెప్తుంది. రౌడీకి డబ్బు కూడా ఇస్తుంది. మరొకవైపు గొడవని అత్తయ్య ఉంటే ఆపేది అని ప్రేమ, నర్మద అనుకుంటారు. అమూల్యకి కావలసినవి చేసి.. తనని కాలేజీకీ పంపిస్తారు ఇద్దరు వదినలు. తరువాయి భాగంలో భాగ్యం ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఎలా అంటే చందుకి ఆక్సిడెంట్ అవ్వబోతుంటే ప్రేమ తనని నెట్టుతుంది. దాంతో ప్రేమకి వెహికల్ డాష్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |